News January 6, 2026

వరంగల్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

image

వరంగల్‌లో ఠాగూర్ సినిమా సీన్ రీపీట్ అయ్యింది. వరంగల్ రంగసాయిపేట చెందిన మోహన్ అనే వ్యక్తి శ్వాస సమస్యతో గత డిసెంబర్‌లో ఎంజీఎం ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల చికిత్స అనంతరం కుదుటపడిన మోహన్‌ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని కుటుంబ సభ్యులు గత నెల 27 నుంచి అడుగుతున్నా వైద్యులు డిశ్చార్జ్ చేయకుండా ఠాగూర్ సీన్ లాగా వైద్యం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Similar News

News February 5, 2026

ఫిరాయింపు ఆరోపణలు.. ఆ ఇద్దరే బాకీ!

image

TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది MLAలలో 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్, సంజయ్, గూడెం మహిపాల్, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ పార్టీ మారారంటూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి మిగిలారు. దానం అనర్హత పిటిషన్‌పై ఈ నెల 18కి, కడియంకు 19కి విచారణను స్పీకర్ వాయిదా వేశారు.

News February 5, 2026

కల్తీ నెయ్యి కేసు.. ఇవాళ సీఎంతో పవన్, మాధవ్ భేటీ!

image

AP: కల్తీ నెయ్యి వ్యవహరంపై సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలకం సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ భేటీలో అసలు సూత్రధారులను పట్టుకునేందుకు విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

News February 5, 2026

తిరుమల లడ్డూ కల్తీ నిజమే: ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

image

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయం వాస్తవమేనని MLA విష్ణు కుమార్ రాజు అన్నారు. గతంలో లడ్డూ తీసుకొస్తే 10 రోజుల పాటు సువాసన వచ్చేదని, ఐదేళ్లుగా లడ్డూను చూస్తేనే కల్తీ అయిందని అర్థమవుతోందన్నారు. YCP పాలనలో కొందరు నేతలు దారుణంగా మాట్లాడారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం పరిరక్షిస్తుందని
ఆయన స్పష్టం చేశారు.