News December 2, 2025

వరంగల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 124 కేసులు నమోదు

image

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 124 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలో 94, వెస్ట్ జోన్‌లో 6, ఈస్ట్ జోన్‌లో 2, సెంట్రల్ జోన్‌లో 22 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Similar News

News April 8, 2026

‘ధురంధర్-2’ సక్సెస్‌పై మౌనం వీడిన దీపిక

image

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె పోస్ట్ పెట్టలేదంటూ SMలో చర్చ మొదలైంది. దీనిపై ఆమె తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ‘మీకంటే ముందే నేను సినిమా చూశా. SMలో పెట్టనంత మాత్రాన సపోర్ట్ చేయనట్లా?’ అని కౌంటర్ ఇచ్చారు. రణ్‌వీర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె అనవసర విమర్శలకు ఇలా ఫుల్ స్టాప్ పెట్టారు.

News April 8, 2026

MBNR: కర్నూలు సిటీ-కాచిగూడ రైలు రీషెడ్యూల్!

image

మహబూబ్ నగర్ జిల్లాలోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కారణంగా కర్నూలు సిటీ – కాచిగూడ (17024) రైలు రాకపోకల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 13, 15, 17 తేదీల్లో ఈ రైలు 120 నిమిషాల (2 గంటలు) ఆలస్యంగా నడవనుంది. రైల్వే భద్రత, సామర్థ్యం పెంపు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

News April 8, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

image

ఇరాన్-అమెరికా యుద్ధం నిలిచిపోవడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.3,980 పెరిగి రూ.1,53,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 ఎగబాకి రూ.1,41,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.