News December 1, 2025
వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ కావ్య ప్రశ్న

బలహీన వర్గాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ కడియం కావ్య పార్లమెంట్‌లో కేంద్రాన్ని కోరారు. వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధి పథకాల అమలు, లోపాలపై ఆమె పార్లమెంట్‌లో ప్రశ్నించారు. పీఎంకేవీవై ప్రారంభం నుంచి ఎనిమిది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం అమలులో ఉన్న 4.0లో ఒక్క కేంద్రం కూడా పనిచేయకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News December 1, 2025
BREAKING: మందమర్రిలో అన్నను చంపిన తమ్ముడు

మందమర్రి మండలంలోని సండ్రోన్ పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తోడబుట్టిన అన్నను తమ్ముడు హత్య చేశాడు. తమ్ముడు కుమార్ అన్న మెండ్రపు గోపాల్‌ను సోమవారం రాత్రి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 1, 2025
టెక్కలి: డయేరియా ఘటనపై CM ఆరా.!

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో డయేరియా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. CM చంద్రబాబు సోమవారం సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో ప్రబలుతున్న డయేరియాపై ఆరోగ్యశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో డయేరియా ప్రబలడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. తాగునీటిని పరీక్షించాలని ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు. సమీప గ్రామాలను సైతం అప్రమత్తం చేయాలన్నారు.
News December 1, 2025
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ

ఫేజ్-2 మండలాల స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీజ ఈరోజు పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో అన్ని విధానాలు జాగ్రత్తగా అమలవుతున్నాయని ఆమె నిర్ధారించుకున్నారు. అనంతరం డీపీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రోజువారీ రిపోర్టింగ్ ప్రక్రియలను ధృవీకరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.


