News October 7, 2025

వరంగల్‌లో బాకీ కార్ట్ vs డోఖా కార్డ్

image

ఉమ్మడి వరంగల్‌లో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందంటూ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను BRS రిలీజ్ చేస్తే.. గత పదేళ్లలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ‘BRS కా డోఖా కార్డు’ను కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు. వరంగల్‌ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని BRSను కాంగ్రెస్ విమర్శిస్తే, అధికారం కోసం అమలు కాని హామీలిచ్చిందని కాంగ్రెస్‌ను BRS నాయకులు విమర్శిస్తున్నారు. మీ కామెంట్.

Similar News

News October 7, 2025

KNR: హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో ఉత్కంఠ..!

image

SEC స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ GOను సవాల్ చేస్తూ కొందరు హై, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఉమ్మడి KNRలోని ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో చూస్తున్నారు.

News October 7, 2025

నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి పోస్టును బట్టి CA, MBA, PGDM, PGDBM, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. వెబ్‌సైట్: https://www.nhb.org.in/

News October 7, 2025

HYD: జాతీయ పార్టీలు ఆలస్యమెందుకు..?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కాగా ప్రాంతీయ పార్టీ అయిన BRS అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దిగిందని, జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, BJP మాత్రం ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నాయో అర్థంకావడం లేదని స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే బలమైన అభ్యర్థుల కోసం అధిష్ఠానాలు చూస్తున్నాయని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?