News April 5, 2025
వరంగల్‌లో సన్నబియ్యం పంపిణీ.. BJP, కాంగ్రెస్ వార్

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బియ్యం మేమిస్తున్నామంటే మేమిస్తున్నామని ఓరుగల్లు BJP, కాంగ్రెస్ నాయకుల మధ్య వార్ నెలకొంది. కేంద్రం 5KGలు, రాష్ట్రప్రభుత్వం 1KG మాత్రమే ఇస్తుందని BJPనేతలు అంటుంటే.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో ఎందుకు పెట్టలేదని BJP నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News November 6, 2025
మినుము పంటలో విత్తన శుద్ధితో అధిక దిగుబడి

మినుము పంటలో తెగుళ్ల కట్టడికి విత్తనశుద్ధి కీలకం. దీని కోసం కిలో విత్తనానికి 2.5 గ్రాముల కాప్టాన్ (లేదా) థైరాన్ (లేదా) మాంకోజెబ్‌లతో విత్తనశుద్ధి చేయాలి. తర్వాత కిలో విత్తనానికి 5ml ఇమిడాక్లోప్రిడ్ 600 FS మందును కలిపి నీడలో ఆరనివ్వాలి. విత్తడానికి గంట ముందుగా కిలో విత్తనానికి 20గ్రా రైజోబియం కల్చరును కలిపినట్లైతే, నత్రజని బాగా అందుబాటులో ఉండటం వల్ల, అధిక పంట దిగుబడిని పొందవచ్చు.
News November 6, 2025
పెద్దపల్లిలో రోడ్ సేఫ్టీ పనుల స్థల పరిశీలన

PDPLబస్టాండ్, అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్ సేఫ్టీ పనులను గురువారం మున్సిపల్, RTC, ట్రాఫిక్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పరిశీలించారు. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జరిగిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఇచ్చిన సూచనల మేరకు బస్సులు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు రోడ్ వెడల్పు, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. RTC అధికారులతో చర్చించి పనులు ప్రారంభిస్తామన్నారు.
News November 6, 2025
గోదావరిఖని: ‘అబ్సెంటిజం సర్క్యూలర్‌పై ఆందోళనలో కార్మిక వర్గం’

సింగరేణి యాజమాన్యం అబ్సెంటిజంపై జారీ చేసిన సర్క్యూలర్‌తో కార్మిక వర్గం ఆందోళనకు గురవుతుందని TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అబ్సెంటిజం సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మెడికల్ బోర్డు నిర్వహణ త్వరలో చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పోరాటం చేయడం తప్పదని హెచ్చరించారు.


