News March 27, 2026

వరంగల్‌లో హోటళ్ల మూత..!

image

అంతర్జాతీయ పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోటల్ రంగం కుదేలవుతోంది. యుద్ధ ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరగడం, పర్యాటక ఆధారిత హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే బ్రేక్‌ఫాస్ట్ ధరలను పెంచిన యాజమాన్యాలు, స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ సేవలను నిలిపివేశాయి. ట్రై సిటీ పరిధిలోని దాదాపు 1,100 హోటళ్లు మరో వారం రోజుల్లో పూర్తిగా మూతపడే ప్రమాదం కనిపిస్తోంది.

Similar News

News March 27, 2026

NZB: పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి: కవిత

image

ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ అద్వయ కన్వేషన్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నిజామాబాద్ ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ఉదయం 8 గంటలకే కార్యకర్తలు, నాయకులు చేరుకోవాలని సూచించారు. BRS నుంచి సస్పెన్షన్‌కు గురైన తరువాత సొంత పార్టీతో జనంలోకి వెళ్తానని ప్రకటించిన కవిత.. కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు.

News March 27, 2026

రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో 7 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. APR 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఆస్కారముందని చెప్పింది. ఇక రేపు 8.30am వరకు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News March 27, 2026

వరంగల్: జనగణన తొలి దశకు సర్వం సిద్ధం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న మొదటి దశ జనగణన, ఇళ్ల గుర్తింపు సర్వేకు అధికారులు సిబ్బందిని కేటాయించారు. ప్రతి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేటర్ చొప్పున నియామకాలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో 1135, హనుమకొండలో 1030, మహబూబాబాద్‌లో గరిష్టంగా 1702 మందితో పాటు మిగిలిన జిల్లాల్లోనూ వివిధ శాఖల నుండి సూపర్ వైజర్లను నియమించి కసరత్తు పూర్తి చేశారు.