News April 9, 2025
వరంగల్‌లో CONGRESS VS BRS

ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRS నేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
Similar News
News January 21, 2026
MDK: హత్యాయత్నం కేసులో నేరస్తుడికి ఐదేళ్ల జైలు శిక్ష

నర్సాపూర్ PS పరిధిలో ఇవ్వాల్సిన డబ్బులను అడిగిన వ్యక్తిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సుభావళి తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆటో డ్రైవర్ వడ్ల నిరంజన్ కల్లు తాగేందుకు కల్లు దుకాణం వద్దకు వెళ్లగా, అక్కడ కనిపించిన శివప్రసాద్‌ను ఇవ్వాల్సిన డబ్బులు అడగగా గొడవ జరిగింది. దీంతో కల్లు సీసా పగలగొట్టి పొడిచాడు.
News January 21, 2026
ఉ.10 గం. వరకు పొగమంచు.. వాహనదారులు జాగ్రత్త!

AP: మరో రెండు రోజుల పాటు తెల్లవారుజాము నుంచి ఉ.10 గం. వరకు పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల విజిబిలిటీ వంద మీటర్ల కంటే తక్కువగా నమోదవుతుందని, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు కోస్తా, రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. నిన్న అరకు లోయలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
News January 21, 2026
వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.


