News March 8, 2025
వరంగల్‌లో KCR భారీ బహిరంగ సభ

BRS పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో మాజీ సీఎం KCR శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో ఆయన కీలక ప్రకటన చేశారు. వరంగల్ గడ్డపై లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సూచనలు చేయగా వారు గ్రౌండ్‌ను పరిశీలించారు.
Similar News
News December 17, 2025
సర్పంచ్ ఫలితాలు.. 3 ఓట్ల తేడాతో గెలుపు

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కొంత మంది అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా గాంధీనగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన బానోతు మంగీలాల్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. NZB జిల్లా బాన్సువాడ మం. నాగారంలో కాంగ్రెస్ మద్దతుదారు దౌల్తాపూర్ గీత 7 ఓట్ల తేడాతో గెలిచారు. కామారెడ్డి (D) జగన్నాథ్‌పల్లిలో కాంగ్రెస్ బలపరిచిన గోడండ్లు వెంకయ్య 8 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
News December 17, 2025
MNCL: శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దు- IG

రామగుండం పోలీస్ కమిషనరేట్‌ను మల్టీజోన్–1 IG ఎస్.చంద్రశేఖర్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆర్ముడ్ సాయిధ దళ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి పంచాయతీ ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రత పరిరక్షణ, నేర నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, తదితర అంశాలపై సీపీతో చర్చించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని సూచించారు.
News December 17, 2025
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.


