News October 13, 2025

వరంగల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు సీజ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి 2 ట్రాక్టర్లు, 12 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు, దామెరలో ఒక కేసు నమోదైంది.

Similar News

News October 13, 2025

జగిత్యాల: గ్రీవెన్స్ డే.. స్వయంగా సమస్యలు విన్న SP

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారుల సమస్యలను ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను ఫిర్యాదుల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమస్యలను త్వరగా, పెండింగ్ లేకుండా పరిష్కరించడం, ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి పర్యవేక్షించడం చేయాలని సూచించారు.

News October 13, 2025

JGTL: మిషన్ భగీరథ నూతన EEగా జానకి బాధ్యతలు

image

జగిత్యాల జిల్లా మిషన్ భగీరథ నూతన ఈఈగా జానకి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం మిషన్ భగీరథ కార్యాలయంలో ఈఈగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమా‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ DE జలంధర రెడ్డి, AEలు రాజశేఖర్, దీపక్ పాల్గొన్నారు.

News October 13, 2025

రెండో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్యాంప్‌బెల్(115), షై హోప్(103) సెంచరీలు చేశారు. చివరి వికెట్‌కు గ్రీవ్స్(50*), సీల్స్ (32) అద్భుతంగా పోరాడి 79 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో WI భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా చెరో 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.