News March 3, 2025
వరంగల్: అతిపెద్ద రన్ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News July 6, 2025
అదరగొట్టిన ఆకాశ్‌దీప్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్ ఆకాశ్‌దీప్ సత్తా చాటారు. 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. తన కెరీర్‌లో ఒక ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేయడం విశేషం.
News July 6, 2025
ఫాతిమా కాలేజీని కూలుస్తారా? ‘హైడ్రా’ రంగనాథ్ ఏమన్నారంటే?

HYDలో ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా కాలేజీ సలకం చెరువు FTLలో ఉండటంతో దాన్ని కూల్చివేయాలని ఎన్నో డిమాండ్లు వస్తున్నాయి. దానిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ‘అక్బరుద్దీన్‌పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీని నిర్మించారు. అందులో చాలా మంది ఉచితంగా చదువుకుంటున్నారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. మేము జీవితాలను నాశనం చేయం. ఫైనల్ రిపోర్ట్ రానివ్వండి’ అని ట్విటర్ స్పేస్‌లో అన్నారు.
News July 6, 2025
జగిత్యాల: పలువురు ఎస్ఐలకు స్థాన చలనం

జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు బాసర మల్టీజోన్ ఐజీ 2 ఉత్తర్వులు జారీ చేశారు. కే. కుమారస్వామి బీర్పూర్ నుంచి డీఎస్‌బీ జగిత్యాల, మిర్యాల రవీందర్ వీ.ఆర్ జగిత్యాల నుంచి ధర్మపురి ఎస్సై 2, ఎస్.రాజు వీ.ఆర్ జగిత్యాల నుంచి బీర్పూర్, ఎం.సుప్రియ వీ.ఆర్ జగిత్యాల నుంచి సీసీఎస్ జగిత్యాలకు ట్రాన్స్ఫర్ అయినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.