News March 2, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News December 31, 2025

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్!

image

TG: వచ్చే విద్యాసంవత్సరం(2026-27) నుంచి ఇంటర్ బోర్డ్ మ్యాథ్స్ పరీక్షను 60 మార్కులకే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మ్యాథ్స్-A, B పేపర్లకు 75 మార్కుల చొప్పున ఉండగా CBSE తరహాలో 15 మార్కులు ఇంటర్నల్స్ ద్వారా కేటాయించనుంది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుంది. అటు MPC, MEC విద్యార్థులకు ఒకే సిలబస్ ఉండగా వేర్వేరు క్వశ్చన్ పేపర్లతో నిర్వహించేలా వచ్చే ఏడాది సిలబస్‌లోనూ మార్పులు చేయనుంది.

News December 31, 2025

జుట్టు విపరీతంగా రాలుతోందా?

image

ఒత్తయిన జుట్టును మహిళలందరూ కోరుకుంటారు. అయితే రక్త హీనత, డైటింగ్, థైరాయిడ్ సమస్యలు, కెమికల్ ప్రొడక్ట్స్, హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌ల వాడకం, గర్భధారణ సమయాల్లో విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. దీని నివారణకు ఒమేగా-3, జింక్, ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకుని గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

News December 31, 2025

రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రహదారి భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన రహదారి భద్రతా, మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖ, R&B శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (Black spots) గుర్తించాలన్నారు.