News February 19, 2025
వరంగల్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 19, 2025
రాజధానికి చేరిన వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ..!

వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అంతర్గత కలహాలు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. మంత్రి కొండా సురేఖ, 40 ఏళ్లుగా పార్టీ జెండాను మోసిన తమను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ నేతలనే పోలీసులతో కొట్టించారంటూ మీనాక్షి దృష్టికి పీసీసీ డెలిగేట్ సభ్యుడు నల్లగొండ రమేశ్ తీసుకెళ్లినట్టు తెలిసింది. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
News December 19, 2025
పెద్దపల్లి: ‘ప్రజల విశ్వాసం మరింత బలపడింది’

గ్రామ పంచాయతీల రెండో సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా అదనపు ఎన్నికల అధికారి & పంచాయతీ అధికారి వీరబుచ్చయ్యకు ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు గురువారం సన్మానం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఆయన అందించిన మార్గదర్శకత్వం, సమన్వయం కీలకమని అధికారులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని అన్నారు.
News December 19, 2025
HYDలో బ్రెడ్ క్రంబింగ్ ట్రెండ్.. బకరాలు లోడింగ్!

సిటీలో ప్రేమ ‘పెళ్లి’ దాకా వెళ్లడం లేదు.. గాల్లో దీపం పెట్టినట్లే ఉంది. పబ్‌లో పార్టీలు చేసుకుంటూ ఎదుటి మనిషికి అప్పుడప్పుడు ఓ మెసేజ్ పంపి, వాళ్లు రిప్లై ఇస్తే మళ్లీ రెండు రోజులు సైలెంట్ అయిపోవడమే ఈ కొత్త ట్రెండ్. తమ చుట్టూ తిప్పుకోవడానికి వేసే బిస్కెట్లు ఇవి. ఈ ట్రాప్‌లో పడి చాలా మంది మనసులు ముక్కలవుతున్నాయి. సో.. HYD యూత్.. ఆ ‘హాఫ్-హార్టెడ్’ లైకులను చూసి మురిసిపోకండి. బకరాగా మిగలకండి.


