News August 30, 2024

వరంగల్: అపరిష్కృతంగా 82 వేల పైచిలుకు దరఖాస్తులు!

image

అనుమతి లేని స్థలాల క్రమబద్ధీకరణకు అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి. పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్ ల్యాండ్ సీలింగ్) నిబంధనలు, WGL నూతన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) జోన్లు, ధరణి పోర్టల్ అనుసంధానంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. HNK, WGL ప్రాంతాల్లో 82 వేల పైచిలుకు దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉంది. అపరిష్కృతంగా ఉన్న స్థలాల క్రమబద్ధీకరణ కోసం వేలాదిమంది బల్దియా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Similar News

News September 29, 2024

పాలకుర్తి: ఇళ్లు ఖాళీ చేయించడం దారుణం!

image

పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధితులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేకపోవడంతో తన సొంత ఖర్చులతో 20 గ్రామాల్లో భూమి కొనుగోలు చేసి నిరేపేదలకు అందించామన్నారు.

News September 29, 2024

సంతాపం ప్రకటించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు

image

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణం పట్ల ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప రాజకీయ నాయకునిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దిన వారు ధన్యులని మంత్రులు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని మంత్రులు చెప్పారు.

News September 29, 2024

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత: మంత్రి సీతక్క

image

వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వృద్ధులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.