News May 10, 2024

వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని ఆశీర్వదించాలి: రమేశ్

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరిని కోలాట బృందాలు, డప్పు చప్పులతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. వరంగల్ అభివృద్ధి చెందాలన్నా, నిధులు రావాలన్నా.. బీజేపీని ఆశీర్వదించాలని అన్నారు.

Similar News

News January 20, 2025

తెల్లవారుజామున నగరంలో వరంగల్ సీపీ ఆకస్మిక తనిఖీలు

image

శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈరోజు తెల్లవారుజామున నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్‌తో పాటు ఏటీయం సెంటర్లను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్, ఏటీయం సెంటర్లలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రాత్రి సమయాల్లో పోలీస్ సిబ్బంది పనితీరును గమనించేందుకు సీపీ హన్మకొండ పోలీస్ స్టేషన్ సైతం తనీఖీ చేశారు.

News January 20, 2025

ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు. 

News January 19, 2025

భూపాలపల్లి: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

రైతుభరోసా, నూతన రేషన్ కార్డులు విచారణ ప్రక్రియలో జిల్లా, మండలస్థాయి అధికారులు భాగస్వాములైనందున ఈనెల 20న (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు ప్రజావాణి తాత్కాలిక రద్దుపై ఆదివారం ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి విచారణ, 21వ తేదీ నుంచి జరుగనున్న గ్రామసభల నిర్వహిస్తామన్నారు.