News September 23, 2025
వరంగల్: అమ్మాయిలూ.. మౌనంగా ఉండకండి!

ఎవరైనా ఆకతాయిలు మహిళలు, విద్యార్థినులను వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో వరంగల్ వస్త్ర దుకాణంలో షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై షాపు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని ఎస్సై సూచించారు.
Similar News
News September 23, 2025
ఖానాపూర్: గోదావరికి పోటెత్తిన వరద

ఎస్సారెస్పీకి వచ్చిన వరదను దిగువకు వదలడంతో ఖానాపూర్, కడెం, మామడ మండలాల పరిధిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు నదివైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
News September 23, 2025
పెంబి: జేపీఎస్‌లకు ఈగోస

మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో పెంబి మండలంలో పంచాయతీ కార్యదర్శులు(జేపీఎస్‌లు) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వారు చెట్లు, పుట్టలు, ఇళ్లపైకి ఎక్కి ఫోటోలు తీయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి తక్షణమే సిగ్నల్స్ రూటర్లు ఏర్పాటు చేయాలని జేపీఎస్‌లు కోరుతున్నారు.
News September 23, 2025
జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.