News January 13, 2026
వరంగల్: అవుట్‌సోర్సింగ్ నుంచి ప్రభుత్వ కొలువుకు!

ఎంజీఎం, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులు ప్రభుత్వ కొలువులు సాధించారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించిన పరీక్షలో వీరు ఉత్తీర్ణత సాధించి ల్యాబ్ టెక్నీషియన్ Gr-IIగా ఎంపికయ్యారు. వీరికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ఆసుపత్రులు, కళాశాలల్లో పోస్టింగ్స్ ఇస్తూ మంగళవారం ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది.
Similar News
News February 4, 2026
మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం

TG: పంచాయతీ ఎన్నికల్లాగే.. మున్సిపల్ పోరులోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించాలని మంత్రులతో CM రేవంత్ రెడ్డి అన్నారు. క్యాబినెట్ మంత్రులతో సమావేశమైన సీఎం, ఎలక్షన్‌లో ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. విజయంపై నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, అయినా ఎన్నికలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకా రెబల్స్ ఉంటే వారిని రాజీ చేయాలని, మంత్రులంతా జిల్లాలకు వెళ్లాలని సూచించారు.
News February 4, 2026
కరీంనగర్ ‘పుర’ సమరం.. బరిలో 398 మంది

కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల చిత్రం స్పష్టమైంది. మొత్తం 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ, బీఆర్‌ఎస్ (66 చొప్పున), కాంగ్రెస్ (65), ఫార్వర్డ్ బ్లాక్ (31), ఎంఐఎం (15), జనసేన (14), బీఎస్పీ (7) పోటీ పడుతున్నాయి. సీపీఐ, సీపీఐ-ఎంఎల్ నుంచి ఒక్కొక్కరు, ఇతర పార్టీల నుంచి 9 మంది, 123 మంది స్వతంత్రులు బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
News February 4, 2026
TODAY HEADLINES

* మా సహనమే గెలిపించింది.. USతో ట్రేడ్ డీల్‌పై మోదీ
* మోదీని బెదిరించి ట్రంప్ డీల్: రాహుల్
* రాహుల్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: గోయల్
* మణిపుర్ CMగా ఖేంచంద్
* కల్తీ నెయ్యి కేసు.. విచారణ కమిషన్‌కు AP క్యాబినెట్ నిర్ణయం
* మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు: పవన్
* మోహన్ బాబు, విష్ణుపై కేసు
* TGకి 4.30 లక్షల ఇళ్లు: కిషన్ రెడ్డి
* 2L ఉద్యోగాలు ఎక్కడ: KTR
* TG: చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు


