News September 8, 2025

వరంగల్: ఆయనే కారణం.. అందుకే చనిపోతున్న: మహిళా వీఆర్ఏ

image

వరంగల్ జిల్లా నల్లబెల్లి తహశీల్దార్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్ <<17649982>>ఆత్మహత్యకు యత్నించిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. MRO ఆఫీస్‌లో పనిచేసే మహిళా VRA వాంకుడోత్ కల్పన సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అంతకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో చరణ్ సింగ్ కారణమని పేర్కొంది. ఆమెను నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 9, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 9, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.38 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
✒ ఇష: రాత్రి 7.36 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 9, 2025

కరాటే పోటీల్లో రాయికల్ విద్యార్థులకు ‘GOLD’

image

కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాయికల్ ఎస్సై సుధీర్ రావు అన్నారు. కరీంనగర్లో జరిగిన 3వ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ స్టైల్ కుంగ్ ఫూ అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో రాయికల్‌కు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరికి ఎస్సై పతకాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కరాటే మాస్టర్ ప్రభాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

News September 9, 2025

SRCL: ప్రజావాణికి 154 దరఖాస్తులు

image

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇవాళ జరిగిన ప్రజావాణిలో 154 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 49, అత్యల్పంగా SC కార్పొరేషన్, ADSLR, జిల్లా వ్యవసాయ శాఖ, ఏడీ మైన్స్, వేములవాడ మున్సిపల్, DEO, ఇరిగేషన్, EEPR, DIEO, LDM, మార్కెటింగ్ శాఖకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్జీలను త్వరితగతిన పరిష్కారించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.