News September 19, 2025
వరంగల్: ఆయన రెక్కాడకుంటే పస్తులే..!

పూట గడవాలంటే కుటుంబ పెద్ద కష్టపడాల్సిందే. ఆయన రెక్కాడకుంటే పస్తులు తప్పవు. వయస్సు పెరిగే కొద్దీ కుటుంబం బాధ్యత పెరుగుతుంది. ఆయనే కుటుంబానికి వెన్నెముక. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లెకు చెందిన ప్రకాశం 85 ఏళ్ల వయస్సులో కూడా కష్టపడుతున్నాడు. వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ ప్రతిరోజూ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం నేటి యువతకు ఆదర్శం. మీ కామెంట్.
Similar News
News September 19, 2025
ములుగు: ‘అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలి’

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ డాక్టర్ వి.బాలకిష్టారెడ్డి సూచించారు. ఉద్యానవర్సిటీ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని అయితే అన్ని దేశాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా ఏకకాలంలో జరిగేటట్టు చూసుకోవాలన్నారు.
News September 19, 2025
ఆదిలాబాద్: ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్ ఎస్పీగా పదోన్నతి రాగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన కాజల్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.
News September 19, 2025
వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.