News November 29, 2025
వరంగల్: ఆ జీపీని చూసేందుకు ప్రపంచ దేశాలు పోటీపడతాయ్!

గ్రామాన్ని సందర్శించేందుకు ప్రపంచంలోని దేశాలు పోటీ పడతాయంటే నమ్ముతారా? అవును. ఇది నిజమే, వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామాన్ని చూసేందుకు వివిధ దేశాలు, మనదేశంలోని రాష్ట్రాలు పోటీ పడతాయి. గ్రామ పాలనలో మహిళల పాత్ర ముఖ్యంగా ఉండటం, ప్రజాప్రతినిధులుగా కొన్నేళ్లపాటు మహిళలే నడిపించడంతో ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఈసారి జనరల్ మహిళకు కేటాయించడంతో గ్రామ సర్పంచ్ ఎన్నిక ఎలా ఉంటుందో చూడాలి.
Similar News
News December 2, 2025
జీటీఏ కరీంనగర్ నూతన అధ్యక్షుడిగా రవీందర్ ఎన్నిక

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (GTA) కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శినిగా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హార్ధికంగా, ఆర్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.
News December 2, 2025
హైదరాబాద్‌లో జిల్లా జర్నలిస్టుల ధర్నా

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తలపెట్టిన చలో సమాచార భవన్ కార్యక్రమం విజయవంతమైనట్లు టీడబ్ల్యూజే ఎఫ్ జిల్లా కార్యదర్శి కుడి తాడి బాపురావు తెలిపారు. ఈ ధర్నాలో జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు, భీమా, ఆరోగ్య ప్రయోజనాలు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తదితర సమస్యలను డిమాండ్ చేసినట్లు కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు పేర్కొన్నారు.
News December 2, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామలో అరుదైన కపాల శాస్త్ర చికిత్స
> శ్రీపతిపల్లి సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు
> నర్మెట్ట: వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవలోకి.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
> తీగల తండా సర్పంచ్ గా సాంబరాజు యాదవ్ ఏకగ్రీవం
> నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి ఎన్నికల అబ్జర్వర్
> ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి: అదనపు కలెక్టర్
> ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్


