News February 26, 2025
వరంగల్: ఆ రూట్ బస్ ఛార్జీలపై సబ్సిడీ

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ఛార్జీలపై సబ్సిడీ ప్రకటించింది. హనుమకొండ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని ఏసీ, సూపర్ లగ్జరీ బస్ టికెట్లపై 10 శాతం ధరలు తగ్గించారు. దీంతో రాయితీ అనంతరం టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ స్లీపర్ బెర్త్ టికెట్ రూ.1770, ఏసీ టికెట్ రూ.1380, సూపర్ లగ్జరీ రూ.1000గా ఉంటుంది.
Similar News
News February 26, 2025
KMR: MLC ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

MLC ఎన్నికలు సజావుగా, నిబంధనల మేరకు నిర్వహించాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ నెల 27న జరుగనున్న MDK, NZB, ADBD, కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News February 26, 2025
తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు!

తప్పు చేయకపోయినా చాలా మంది జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అతని పిల్లలు లాయర్లుగా మారారు. యూపీలోని కాన్పూర్‌లో జరిగిన ఓ వివాదంలో అనిల్ గౌర్‌పై తప్పుడు ఆరోపణల కారణంగా అతను 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అతడు నిర్దోషని నిరూపించేందుకు కొడుకు రిషభ్, కూతురు ఉపాసన లా చదివారు. తండ్రి కేసుపై ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేసి విజయం సాధించారు.
News February 26, 2025
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కర్నూలులోని కోడుమూరు రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సీ.బెళగల్(M) పోలకల్‌కు చెందిన మహేంద్ర(30) మృతిచెందాడు. భార్య, కూతురితో కలిసి మహేంద్ర రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. భార్య ఊరికెళ్లడంతో మిత్రుడు లింగంతో కలిసి బైక్‌పై బళ్లారి చౌరస్తాకు వచ్చాడు. ఓ హోటల్‌లో టిఫిన్ చేసి తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తన స్నేహితుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.