News October 3, 2025
వరంగల్: ఆ సీఐ ముందు నుంచి వివాదాస్పదుడే..!

నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి ముందు నుంచి వివాదాస్పదుడిగా తెలుస్తోంది. గతంలో జనగామ సీఐగా పనిచేసిన సమయంలో అడ్వకేట్ అమ్భతరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్న ఘటనలో భార్య ఎదుటే అడ్వకేట్‌ను అవమానపరిచాడనే ఆరోపణలతో సీపీ విచారణ జరిపారు. తాజాగా గాంధీ జయంతి రోజు నర్సంపేటలో జంతువధను చేస్తున్న సమయంలో కత్తితో త్వరగా కొట్టు అంటూ అనడంపై వివాదాస్పదమైంది. ఈ ఘటనపై DCP ఈస్ట్ జోన్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
Similar News
News October 3, 2025
CSIR-IICTలో ఉద్యోగాలు

CSIR-IICT 7 సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. పోస్టును బట్టి పీహెచ్‌డీ, ఎంటెక్/ఎంఈ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in/CAREERS
News October 3, 2025
నరసరావుపేట: ఈ నెల 6న స్వచ్ఛ అవార్డులు

రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అక్టోబర్ 6న ప్రదానం చేయనున్నామని కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైంది వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది అవార్డులు దక్కించుకున్నాయన్నారు. SASA పోర్టల్ (https://sasa.ap.gov.in/) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
News October 3, 2025
ఎర్రుపాలెం: మనవడి చేతిలో అమ్మమ్మ హత్య..?

ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన శాఖమూరి పద్మ (60)ను ఆమె మనవడు శాఖమూరి చీరాల సాయి శుక్రవారం హతమార్చినట్లు చర్చించుకుంటున్నారు. పద్మ నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.