News October 17, 2025
వరంగల్: ఇక కేజీబీవీలో హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టం..!

కేజీబీవీలో ఇప్పటి నుంచి హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టం అమలు కానుంది. హాస్టల్ నిర్వహణ బిల్లులు నిన్నటి వరకు రాతపూర్వకంగా అమలు కాగా ఇప్పటి నుంచి ఆన్లైన్ సిస్టం ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. దీంతో విద్యార్థులకు రావాల్సిన బిల్లులు, హాస్టల్‌కు రావాల్సిన బిల్లులో ఆలస్యం ఉండదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 66 కేజీబీవీలు ఉండగా ఈ విధానం అమలు కానుంది. దీంతో అధికారులకు సైతం ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
Similar News
News October 18, 2025
ఆభరణాలు పెట్టుకుంటే అలర్జీ వస్తోందా?

నగలు పెట్టుకున్నపుడు కొందరికి అలర్జీ వస్తుంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఆర్టిఫిషియల్ ఆభరణాల్లో ఎక్కువగా వాడే నికెల్ అనే లోహం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, పొక్కులు వస్తుంటాయి. వీటిని వేసుకొనేముందు పౌడర్/ మాయిశ్చరైజర్/ క్యాలమైన్ లోషన్స్ రాసుకుంటే మంచిది. లేదంటే స్టెయిన్‌లెస్ స్టీల్, టైటానియం, 18 క్యారెట్ ఎల్లో గోల్డ్, స్టెర్లిన్ సిల్వర్‌లను ఎంచుకోవచ్చు.
News October 18, 2025
SPMVV: ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో (B.Voc) బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్స్ ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News October 18, 2025
DRDO PXEలో 50 అప్రెంటిస్‌లు

DRDOకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్(PXE) 50 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గలవారు ఈనెల 19 వరకు training.pxe@gov.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in