News February 28, 2026
వరంగల్: ఇద్దరు సీఐలపై వేటుకు రంగం సిద్ధం?

వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న ఇద్దరు ఎస్‌హెచ్‌వోలపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నగరంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులు సివిల్ తగాదాల్లో తలదూర్చి, భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఫిర్యాదులు రావడంతో వారిపై విచారణ జరిపినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరి అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడంతో వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు తెలిసింది.
Similar News
News February 28, 2026
VKB: జిల్లాలో 78 మంది విద్యార్థుల ఎంపిక

వికారాబాద్ జిల్లాలో నేషనల్ మిన్స్ కం మెరిట్స్(NMMS) స్కాలర్షిప్‌నకు 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పరీక్షకు 1,097 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 78 మంది ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ప్రభుత్వం స్కాలర్షిప్స్ అందించనుంది. విద్యార్థులకు సంబంధించిన అన్ని అర్హత ధ్రువీకరణ పత్రాలను ఉన్నతాధికారులకు పంపించేందుకు జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు.
News February 28, 2026
కసాయి తల్లి.. కన్నబిడ్డనే చెత్తకుప్పలో పడేసింది!

సత్యసాయి జిల్లా: కన్నప్రేమ కరువైందో లేక కనికరం చచ్చిందో కానీ, సోమందేపల్లి మండలం నడింపల్లిలో ఒక పసికందు పురిటిలోనే అనాథగా మారింది. నవమాసాలు మోసి, రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చే అమ్మే ఆ పసి ప్రాణాన్ని చెత్తదిబ్బలో పడేసింది. శనివారం ఆ చిన్నారి ఏడుపు విని గ్రామస్థులు పరుగున వెళ్లి చూశారు. ప్రస్తుతం ఆ చిన్నారి హిందూపురం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
News February 28, 2026
పార్టీ ఏర్పాటుకు ముందు క్లీన్‌చిట్.. ఇక దూకుడేనా?

TG: లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో జాగృతి చీఫ్ కవిత దూకుడు పెంచే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటుకు ముందు నిర్దోషిగా తేలడం ఆమెకు సానుకూల అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు BRS నుంచి మద్దతు లభించలేదని కవిత పలుమార్లు వాపోయారు. పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత ‘లిక్కర్ క్వీన్’ అంటూ పలువురు BRS శ్రేణులు ఆమెను విమర్శించాయి. మరి ఇప్పుడు వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.


