News December 31, 2024
వరంగల్: ఉపాధ్యాయ నియోజకవర్గ తుది ఓటరు జాబితా విడుదల
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ తుది ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారు. కాగా ఉమ్మడి జిల్లాల్లో 200పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఇందులో 14,940 పురుషులు, 9,965మంది మహిళా ఉపాధ్యాయ ఓటర్ లు ఉన్నారు. మొత్తంగా 24,905 ఓటర్ లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 2,351మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 2, 2025
10న వల్మీడి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ముక్కోటి ఏకాదశి- వైకుంఠ ద్వార సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.
News January 2, 2025
వరంగల్ మార్కెట్‌లో చిరు ధాన్యాల ధరలు ఇలా..
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం వివిధ రకాల చిరు ధాన్యాలు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటాకు రూ.7,200 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.4,680 ధర పలికింది. అలాగే పసుపు క్వింటాకు రూ.11,329 ధర పలికింది. కాగా మంగళవారంతో పోలిస్తే పల్లికాయ ధరలు పెరగగా పసుపు ధర స్వల్పంగా తగ్గింది.
News January 2, 2025
వరంగల్: తగ్గిన మొక్కజొన్న ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి ఈరోజు మొక్కజొన్న తరలివచ్చింది. మంగళవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి ధర రూ.2,570 పలకగా.. ఈరోజు రూ.2,565కి పడిపోయింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర రూ.15,500 పలకగా, కొత్త 341 రకం మిర్చి సైతం రూ.15,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు.