News July 2, 2024
వరంగల్: ఉమ్మడి జిల్లాలో పలువురు ఏఎస్పీల బదిలీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ బాబాసాహెబ్ ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. జనగామ ఏఎస్పీ అంకిత్ కుమార్ శంకవార్ భద్రాచలంకు, గ్రేహౌండ్స్ నుంచి శివమ్ ఉపాధ్యాయ ఏటూరునాగారం ఏఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 8, 2026
పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు: వరంగల్ కలెక్టర్

ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను ఆమె పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
News February 8, 2026
వరంగల్: మల వ్యర్థాలు బహిరంగంగా వేస్తే జైలుకే!

మల వ్యర్థాలను బహిరంగంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం శానిటేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.
News February 7, 2026
వరంగల్: ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవోలు, ఏపీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.


