News September 21, 2025

వరంగల్: ఎంగిలిపూల బతుకమ్మ విశిష్టత ఇదే..!

image

పూల పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఆహ్వానిస్తూ ఓరుగల్లులో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ చేస్తారు. వర్షాకాలం ముగిసి కొత్త పంటలు రావడానికి సిద్ధమయ్యే రోజుగా భావిస్తారు. ఇదే రోజున గౌరమ్మను తమ ఇంటికి ఆహ్వానించే రోజుగా కొలుస్తారు. తొలిరోజు బతుకమ్మ బంధువులను స్నేహితులను కలిపే రోజుగా తలుస్తారు. వైద్య గుణాలు కలిగిన తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి పువ్వులు వాడటం ఆనవాయితీగా వస్తోంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News September 21, 2025

సిరిసిల్ల: మైనారిటీల కోసం మరో 2 పథకాలు..!

image

మైనారిటీ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం <<17777841>>మరో 2 పథకాలు<<>> ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన ద్వారా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయం అందించనుంది. రేవంతన్నా కా సహారా పథకం కింద దూదేకుల ముస్లింలకు మోపెడ్‌లు, బైక్‌లు పంపిణీ చేయనుంది. ఆసక్తిగలవారు OCT 6 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి భారతి తెలిపారు. SHARE.

News September 21, 2025

ADB: కొండా లక్ష్మణ్.. ఆయన జీవితమే పోరాటం

image

స్వాతంత్ర్యమే కాదు.. తెలంగాణ కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. ASF(D)లో పుట్టిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఆది గురువుగా నిలిచారు. 1969లో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘తెలంగాణ పీపుల్స్ పార్టీ’ స్థాపించడమే కాక.. TRS ఆవిర్భావంలోనూ కీలకంగా వ్యవహరించారు. 96 ఏళ్లప్పుడూ స్వరాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారు.

News September 21, 2025

అనంతపురం జిల్లా జాతీయ స్థాయిలో సెకండ్.. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్..!

image

అనంతపురం జిల్లా బిందు సేద్యంలో జాతీయ స్థాయిలో రెండో స్థానం, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించింది. APMIP PD రఘునాథ్‌రెడ్డి, APD ఫిరోజ్‌ ఖాన్‌ ఢిల్లీలో జరిగిన స్కోచ్-2025 అవార్డుల కార్యక్రమంలో ఛైర్మన్ సమీర్ నుంచి అవార్డు అందుకున్నారు. వారికి జిల్లా అధికారులు పెద్దఎత్తున అభినందనలు తెలిపారు.