News June 17, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్ రేపు పున:ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు బక్రీదు పండుగ కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News October 6, 2024

ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య

image

జనగామ జిల్లా వాసిని ఉగాండాలో హత్య చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమలేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉగాండాలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడే పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో తిరుమలేశ్‌పై కాల్పులు జరపడంతో ప్రాణాలు వదిలాడు. అనంతరం సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకొని మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News October 6, 2024

జనగామ: అదృష్టం అంటే ఈవిడదే.. పోయిన బంగారం మళ్లీ దొరికింది

image

పోగొట్టుకున్న బంగారాన్ని ఓ వృద్ధురాలు మళ్లీ పొందగలిగింది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన సోమలక్ష్మి అనే వృద్ధురాలు.. ప్రభుత్వం ఇచ్చిన రాయితీ బియ్యం సంచిలో 5 తులాల బంగారం దాచింది. అయితే గ్రామంలో ఓ వ్యక్తికి ఆబియ్యంను విక్రయించింది. బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తి మరుసటి రోజు మళ్లీ రాగా అతనికి విషయం చెప్పింది. బియ్యం సంచుల్లో వెతకడంతో బంగారం దొరికింది.

News October 6, 2024

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: వరంగల్ కలెక్టర్

image

వచ్చే సోమవారం అక్టోబర్ 7న కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారదా తెలిపారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని, కలెక్టర్ తెలిపారు.