News July 22, 2024
వరంగల్ ఎనుమాముల మార్కెట్ నేడు ప్రారంభం
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున: ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రైతులు నాణ్యమైన, తేమలేని సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
Similar News
News November 28, 2024
వరంగల్: నిన్నటిలాగే తటస్థంగా పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి లాగే ఈరోజు తటస్థంగా ఉంది. గురువారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,840గా ఉంది. చలికాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరకులను మార్కెట్‌కు తీసుకొని రావాలన్నారు. తేమ లేని సరకులు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
News November 28, 2024
కేయూ పట్ల సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు: ఎమ్మెల్యే
కాకతీయ యూనివర్సిటీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. సమకాలీన భారతదేశంలో సామాజిక సంస్థల ద్వారా ప్రపంచీకరణ, అభివృద్ధి, సామాజిక పరివర్తనపై యూనివర్సిటీలో నిర్వహించిన సెమినార్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గతంతో పోలిస్తే అన్ని రంగాల్లో యూనివర్సిటీ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం దోహదడుతుందన్నారు.
News November 28, 2024
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్
భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతంగా చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో చేపట్టిన పూడికతీత పనులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పరిశీలించారు.