News February 3, 2026
వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పెరిగిన మిర్చి ధరలు రైతులకు ఊరటనిస్తున్నాయి. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.19,300 పలికింది. అలాగే వండర్ హార్ట్ సోమవారం క్వింటాకు రూ.32,000 ధర పలకగా, మంగళవారం క్వింటాకు రూ.4 వేలు పెరిగి క్వింటాకు రూ.36,000 అత్యధిక ధర పలికింది. యూఎస్ 341 రకానికి క్వింటాకు రూ.26,000 ధర పలికింది.
Similar News
News February 15, 2026
వినాయకుడిని అంజి.. అని పిలుస్తారని తెలుసా…!

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలోని అగస్త్య గోపురం సమీపంలో పంచసంథి వినాయక ఆలయం ఉంది. ఈ వినాయకుడిని తమిళులు అంజి… అంజి పిలుస్తారు. పూర్వం గ్రామంలోని తగువులు ఈ ఆలయంలో పరిష్కారం చేసేవారిని పుస్తకాల్లో లిఖితపూర్వకంగా ఉంది.
News February 15, 2026
పాలమూరు: విద్యార్థులకు అలెర్ట్.. హాల్ టికెట్ డౌన్‌లోడ్

ఈ నెల 22 ఆదివారం 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమన్వయకర్త వాణిశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19 కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. 6432 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. బ్లాక్ అండ్ బ్లూ పెన్, పరీక్షప్యాడ్, ఆధార్ కార్డ్ తీసుకురావాలన్నారు.
News February 15, 2026
వర్ని: అన్నను చంపిన తమ్ముడు

వర్ని మండలం వడ్డేపల్లిలో కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎత్తరి సాయిబాబా(32)ను అతని తమ్ముడు రాంబాబు కర్రతో తలపై కొట్టి హత్య చేసినట్లు వర్ని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం తల్లి మృతి చెందింది. ఆమె మృతికి అన్న సాయిబాబా కారణమని అనుమానంతో తమ్ముడు రాంబాబు అన్నను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


