News October 15, 2025
వరంగల్: ఎన్ని’కల’ చెదిరింది.. ఎదురుచూపు మిగిలింది..!

కొందరు ముందే ఉహించినా.. నామినేషన్ తొలిరోజే స్థానిక ఎన్నికలు వాయిదా పడటం అనూహ్య పరిణామమే. అఫిడవిట్లు, నామ పత్రాలు సిద్ధం చేసుకొని, ముహూర్తం చూసుకున్న నేతలు హై కోర్టు స్టేతో ఉసూరుమన్నారు. కోడ్ ఎత్తేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో అందరి చూపు అటువైపుకు మళ్లింది. అయితే రిజర్వేషన్లపై అదే సస్పెన్స్ కొనసాగుతోంది.
Similar News
News October 15, 2025
అమ్మానాన్నా.. ఎందుకిలా చేస్తున్నారు!

కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల ఇద్దరు కవలలను చంపేసింది. అనంతరం తానూ బిల్డింగ్‌పై నుంచి దూకి తనువు చాలించింది. ఇవాళ కోనసీమ(D) చిలకలపాడులో భర్త కామరాజు ఇద్దరు పిల్లలను చంపి, బలవన్మరణానికి పాల్పడ్డాడు.
News October 15, 2025
జూబ్లీహిల్స్: ఏకాదశి.. ద్వాదశి.. నామినేషన్ వేయ్ మామా

వచ్చేనెల 11న జరిగే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీ క్యాండిడేట్స్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు విజయం కోసం తపిస్తున్నారు. ముఖ్యంగా ఏ రోజు నామినేషన్ వేస్తే కలిసొస్తుందనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మంచిరోజులు (దశమి.. ఏకాదశి.. ద్వాదశి) ఉండటంతో తమకు అనుకూలమైన రోజు చూసుకొని నామినేషన్ వేయనున్నారు.
News October 15, 2025
జమ్మికుంట: అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు నేడే తుది గడువు

బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ డిగ్రీ)లో దూరవిద్య ద్వారా BA, B.COM, B.Sc మొదటి సంవత్సరం ప్రవేశాలకు నేటితో తుది గడువు ముగుస్తుందని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించి, సాయంత్రంలోగా రసీదు అందించాలన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. వివరాలకు 7382929775 నంబరును సంప్రదించవచ్చు.