News November 30, 2025
వరంగల్: ఎన్నికల పోలింగ్‌కు రెండేళ్లు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో ఘన విజయం సాధించింది. వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ, ములుగు నుంచి గెలిచిన సీతక్క డిసెంబర్ 7న మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Similar News
News April 5, 2026
రామప్ప ప్రాంగణంలో కామేశ్వరాలయం పునరుద్ధరణకు శ్రీకారం

ములుగు జిల్లా పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయ సముదాయంలో ఉన్న కామేశ్వరాలయం పునరుద్ధరణకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు ప్రారంభించింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దాదాపు రూ.6.86 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తికి చేరుకుంది. ఆలయంలోని శిల్పాలు, నిర్మాణ భాగాలను సంరక్షించనున్నారు.
News April 5, 2026
కొండగట్టు అంజన్నకు రూ.1.63 కోట్ల ఆదాయం!

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి రూ.1.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.10 కోట్లు రాగా, దీక్షల విరమణ ద్వారా రూ.33.16 లక్షలు, దర్శనం తదితర సేవల ద్వారా మిగిలిన మొత్తాన్ని భక్తులు సమర్పించుకున్నారు.
News April 5, 2026
GNT: రూ.లక్షల్లో మోసం.. మహిళపై కేసు

బంగారం షాపు యజమానిని మోసం చేసిన మహిళపై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించు కోవాలని చెప్పి ఓ మహిళ బంగారం షాపు యజమాని వద్ద రూ.19 లక్షల నగదుతో పాటు రూ.4 లక్షల విలువైన ఆభరణాలను అప్పుగా తీసుకుంది. ఆమె తీసుకున్న నగదు, బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. దీంతో బంగారం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


