News February 25, 2025
వరంగల్: ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికి అవకాశం దక్కేనో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కేనో అనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. తిరిగి సత్యవతి రాథోడ్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి అవకాశం ఇస్తారా? అనే విషయంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ నిర్ణయం ఫైనల్ కానుంది.
Similar News
News February 25, 2025
నిజామాబాద్: భార్య తిట్టిందని భర్త ఫిర్యాదు

వేరే వ్యక్తి ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడిగినందుకు భార్య తిట్టిందని భర్త ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రకారం.. ఇంద్రసేనారెడ్డి భార్యతో రాగన్నగూడలో ఉంటున్నాడు. భార్య NZB జిల్లా భోదన్లోని ఓ గ్రామంలో జీపీ కార్యదర్శిగా పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి వస్తుంటుంది. ఈ క్రమంలో 23న భార్యకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. కాసేపటికి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పరార్ అవ్వడంతో ప్రశ్నించగా, ఆమె తిట్టిందని తెలిపారు.
News February 25, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

ఉమ్మడి KNR, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి?
News February 25, 2025
WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.