News February 10, 2025

వరంగల్: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

image

వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. ఇంటి నిర్మాణం కోసం వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సమాచారంతో ఏసీబీ అధికారులు రెడ్‌‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2025

నేడు హనుమకొండకు రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హనుమకొండకు రానున్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకొని ఆ తర్వాత HNKలో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. దీంతో పార్టీ శ్రేణులు భారీగా హనుమకొండకు చేరుకుంటున్నాయి. రాహుల్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

News February 11, 2025

WGL: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ.. UPDATE

image

హనుమకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్‌ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

News February 11, 2025

WGL: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

image

ఓరుగల్లు జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతుందని ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్‌(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

error: Content is protected !!