News July 10, 2024

వరంగల్ ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్రంలో పలువురు IPS అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వరంగల్ రేంజ్ ఐజీగా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన చంద్రశేఖర్ రెడ్డి 2016లో పూర్వపు మెదక్ జిల్లా ఎస్పీగా, అనంతరం సంగారెడ్డి ఎస్పీగా చేశారు. 2019లో DIG ర్యాంక్ పదోన్నతి పొందారు. 2021 నుంచి రామగుండం సీపీగా పనిచేశారు.

Similar News

News December 30, 2025

వరంగల్: ఇక మునిసిపల్ పోరుపై రాజకీయం..!

image

రెండు నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టు తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు పట్టణ పోరుపై తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో కౌన్సిల్ స్థానాల ఆశావహులు, నాయకుల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

News December 30, 2025

వరంగల్: ఉదయం 6 నుంచే యూరియ విక్రయం!

image

వరంగల్ జిల్లాలో రైతుల పంటలకు ఉపయోగించే యూరియ కౌంటర్లు ఉ.6 గం.కు తెరిచి విక్రయించవచ్చని కలెక్టర్ సత్య శారద అధికారులను అదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అవసరం అయితే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో యూరియా డీలర్స్ దగ్గర 434 టన్నుల యూరియా స్టాక్ ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 14375 టన్నులు పంపిణీ చేశామని అన్నారు.

News December 30, 2025

యూరియా సరఫరాపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

image

యూరియా సరఫరాపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి 2025-26లో 1,12,345 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయన్నారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.