News December 10, 2025

వరంగల్ ఓటర్లూ.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

ఉమ్మడి WGLలో రేపు మొదటి విడత ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు కాల్ చేసి అలెర్ట్ చేస్తున్నారు. ఛార్జీలు పంపించాం, నేటి రాత్రికే ఇంటికి రావాలని మెసేజ్‌లు పెడుతున్నారు. కుటుంబీకులకు సైతం కాల్స్ చేసి మీపిల్లలను రమ్మని చెప్పాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలువురు ఓటర్లకు డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

Similar News

News December 10, 2025

మరోసారి ఇండిగో విమానాల రద్దు

image

ఇండిగో విమానాల రద్దు మళ్లీ మొదలైంది. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 300 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 137, ముంబైలో 21, బెంగళూరులో 61 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 70 విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభం తర్వాత తమ ఫ్లైట్స్ సర్వీసెస్ సాధారణ స్థితికి చేరాయని నిన్న ఇండిగో సీఈవో పీటర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరోసారి విమాన సర్వీసులు రద్దయ్యాయి.

News December 10, 2025

BREAKING: యర్రగుంట్లలో ఇద్దరు యువకుల మృతి

image

యర్రగుంట్లలోని ముద్దునూరు రోడ్డులో ఉన్న జడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముద్దనూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే చనిపోయారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News December 10, 2025

ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు: NGKL కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ప్రభుత్వయేతర సంస్థలు, పరిశ్రమలలో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఉన్నట్లు వెల్లడించారు.