News January 2, 2026
వరంగల్ కమిషనరేట్‌లో 148 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు. గురువారం రాత్రి కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 148 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో అత్యధికంగా 55 కేసులు నమోదు కాగా, సెంట్రల్ జోన్‌లో 62, వెస్ట్ జోన్‌లో 10, ఈస్ట్ జోన్‌లో 21 కేసులు నమోదయ్యాయి.
Similar News
News January 2, 2026
ప్రజల సంతృప్తి స్థాయిని పెంచండి: కలెక్టర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
News January 2, 2026
అచ్చంపేట – తిరుపతి ఆర్టీసీ బస్సు సర్వీసు రద్దు

అనివార్య కారణాల వల్ల అచ్చంపేట డిపో నుంచి తిరుపతికి వెళ్లే డీలక్స్ బస్సు సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిపో మేనేజర్ పి.ఎం.డి.ప్రసాద్ తెలిపారు. అచ్చంపేట నుంచి జనవరి 2, 4, 6, 8, 10 తేదీల్లోనూ, తిరుపతి నుంచి 3, 5, 7, 9, 11 తేదీల్లోనూ సర్వీసులు ఉండవని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News January 2, 2026
టీవీ రేటింగ్స్.. రికార్డు సృష్టించిన బిగ్‌బాస్-9

టీవీ రేటింగ్‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే రికార్డు సృష్టించినట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. ‘స్టార్ మాలో 19.6 TVR, జియో హాట్‌స్టార్‌లో 285M స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి. గత 5 సీజన్స్‌లో ఇదే అత్యధికం. ఈ సీజన్ మొత్తం ఎమోషన్స్, ప్యాషన్, కాన్‌ఫ్లిక్ట్స్, మర్చిపోలేని మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రేక్షకుల అసాధారణ మద్దతు నిజంగా హిస్టారిక్’ అని ట్వీట్ చేశారు.


