News March 7, 2025
వరంగల్ కమిషనరేట్ క్రైం డీసీపీగా జనార్దన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో విభాగంలో అదనపు ఎస్పీగా పని పనిచేస్తున్న జనార్దన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ క్రైమ్ డీసీపీగా నియమించింది. జనార్దన్ గతంలో ఎస్ఐ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఏసీపీగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేశారు.
Similar News
News February 27, 2026
ప్రభాస్ ‘స్పిరిట్’లో వివేక్ ఒబెరాయ్

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు ప్రకటించిన టీమ్.. ఆయన లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమా మార్చి 5, 2027న రిలీజ్ కానుంది. ఇందులో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
News February 27, 2026
కామారెడ్డి: సంఘటన్ సృజన్ అభియాన్‌తో సంస్థాగత బలోపేతం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై మార్గదర్శనం చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, నగేశ్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
News February 27, 2026
HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT


