News November 21, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 112 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 112 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 54 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

Similar News

News November 22, 2025

కారంచేడులో గ్రామసభ

image

కారంచేడు మండలంలోని గ్రామ పంచాయతీలలో శనివారం ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. బాపట్ల జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ A. విజయలక్ష్మి, ఎంపీడీవో K. నేతాజీ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత నెలలో శ్రామికుల ఈకేవైసీ పూర్తయిందని, మరణించిన వారి జాబ్ కార్డులు రద్దయాయని తెలిపారు. కొత్తగా జాబ్ కార్డుల మంజూరు, రద్దు అయిన కార్డుల పునరుద్ధరణకు గ్రామసభ ఏర్పాటు చేశామన్నారు.

News November 22, 2025

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు అంతా సహకరించాలని కోరారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, నేతలు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలు విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

News November 22, 2025

పైరసీతో చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టం: బన్నీ వాస్

image

పైరసీ వల్ల ఎంతో మంది చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారని బన్నీ వాస్ అన్నారు. పైరసీ తప్పని, అలాంటి తప్పును కొందరు తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఏడాదిలో 10-15 సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారని పేర్కొన్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా చిత్రాలూ పైరసీకి గురవుతున్నాయని తెలిపారు. పైకి బాగానే కనిపిస్తున్నా ఆ నిర్మాతలు లోపల బాధ పడుతున్నారన్నారు.