News February 5, 2026
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 93 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మద్యం బాబులపై పోలీసులు కొరడా ఝళిపించారు. బుధవారం రాత్రి నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 93 మంది పట్టుబడ్డారు. వీరిలో అత్యధికంగా ట్రాఫిక్ స్టేషన్ పరిధిలోనే 48 కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 25, వెస్ట్ జోన్ 7, ఈస్ట్ జోన్‌లో 13 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News February 21, 2026
సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.
News February 21, 2026
ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ప్రపంచం ముందు మనమంతా ఐక్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. రాజకీయ నాటకాలకు AI సమ్మిట్‌ను ఎంచుకోవడం సరికాదని BRS MLA కేటీఆర్ విమర్శించారు. INC కార్యకర్తలు CM రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన చేపట్టారంటూ Xలో ఎద్దేవా చేశారు.
News February 21, 2026
PDPL: పెళ్లి వేడుకలో వ్యక్తి దారుణ హత్య

రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


