News February 14, 2026
వరంగల్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుళ్ల బదిలీలు

వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లతో పాటు మొత్తం 59 మందిని ఇతర ప్రాంతాలకు మార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన వారు తక్షణమే కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.
Similar News
News February 21, 2026
కామారెడ్డికి రానున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు

కామారెడ్డిలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని రమణారెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు.
News February 21, 2026
చిత్తూరు: ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి!

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్‌లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
News February 21, 2026
కెరీర్ గైడెన్స్.. కాల్ చేసి సరైన మార్గాన్ని ఎంచుకోండి!

టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలనే సందేహంలో మీ పిల్లలున్నారా? అలాంటి వారికి సరైన మార్గాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంచుకునేందుకు 1800 425 2428 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. ఆదివారం మినహా ప్రతిరోజూ 9AM నుంచి 6PM వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. SHARE IT


