News November 18, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో మూడు గుట్కా కేసులు

ప్రభుత్వ నిషేధిత పోగాకు విక్రయిస్తున్న ముగ్గురిపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.18,500 విలువ గల గుట్కా, అంబర్ పాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమోదైన కేసుల్లో రెండు కేసులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు కాగా.. కాజీపేట పరిధిలో ఒక కేసు నమోదైంది. నిషేధిత పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News November 18, 2025
బ్రహ్మోత్సవాల్లో రోజుకో చీర.. సీక్రెట్ ఇదే!

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా మొదలయ్యాయి. రోజుకో వాహనంపై అమ్మవారు విహరిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన రంగు చీరలతో అమ్మవారిని అలంకరిస్తారు. కెంపు(ఎరుపు వర్ణం), తెలుపు, పగడపు, ఆకు పచ్చ, పసుపు, నీలం, హేమ వర్ణాల చీరలతో దర్శనమిస్తారు. ఈ వర్ణాల వల్ల అనేక శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఎప్పుడైనా వాహన సేవల్లో ఈ రంగురంగల చీరలను గుర్తించారా..?

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

AP: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు.