News October 22, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీలను స్మరిస్తూ ఫ్లెక్సీలు

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాన కూడళ్లు, పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు సెల్యూట్ చేస్తున్న ఫొటోతో రూపొందించిన ఈ ఫ్లెక్సీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కమిషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Similar News
News October 22, 2025
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్‌కోటి, లింగంపల్లి, బర్కత్‌పూరా, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
News October 22, 2025
NZB: అన్నదాతలను కాంగ్రెస్ అరిగోస పెడుతోంది: కవిత

కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన పాపానికి అన్నదాతలను అరిగోస పెడోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులే ఏకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకన్నా రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని ట్వీట్ చేశారు.
News October 22, 2025
వృద్ధులు, దివ్యాంగులకు రవాణా ఏర్పాట్లు: ఆర్వీ కర్ణన్

ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఆందోళన చెందొద్దని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. వారిని పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. ఈ సదుపాయం కోసం అర్హులు ఈసీ వెబ్‌సైట్‌లో https://ecinet.eci.gov.in/homepage/home తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.