News November 13, 2025

వరంగల్ కమిషనర్ పరిధిలో 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 110 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 57 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనాన్ని సైతం సీజ్ చేయడం జరుగుతుందని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

Similar News

News November 13, 2025

10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

image

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

News November 13, 2025

జగన్‌తో మాజీ మంత్రి అనిల్ భేటీ

image

తాడేపల్లిలో YCP అధినేత జగన్‌ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

News November 13, 2025

కొల్లాపూర్: నల్లమల అడవుల రక్షణకు చెక్‌పోస్ట్

image

నల్లమల అడవులు ఆక్రమణకు గురికాకుండా కట్టడి చేసేందుకు ఒట్టిమాకులకుంట దారిలో అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా అడవులకు కబ్జాదారులు వెళ్లే మార్గాన్ని మూసివేసినట్లు అచ్చంపేట డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011–2014 మధ్య కాలంలో నల్లమల అడవులను నరికివేసి అక్రమ సాగు చేసినట్లు గుర్తించామన్నారు.