News January 8, 2026

వరంగల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనుమానమే?

image

వరంగల్ కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తయ్యింది. రెండు అంతస్తుల్లో 4 బ్లాక్‌ల వారీగా నిర్మాణాన్ని గౌరి శంకర్ ఇన్ ఫ్రా కంపెనీ రూ.61 కోట్లతో పూర్తి చేసింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేశారు. రూ.87 లక్షల వ్యయంతో కలెక్టర్ నివాసం, అడిషనల్ కలెక్టర్, డీఆర్వో, 8 జిల్లా స్థాయి అధికారుల నివాస క్వార్టర్లు నిర్మించారు. ఈ నెల 19న సీఎం రేవంత్ జిల్లాకు వస్తున్నా ప్రారంభోత్సవం డౌటేగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Similar News

News February 20, 2026

‘అవిశ్వాసం’పై INCని ఒంటరి చేసేలా NDA వ్యూహం

image

LS స్పీకర్ ఓం బిర్లాపై INC, ‘ఇండీ’ పక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై MAR 9న చర్చ, ఓటింగ్ జరగనుంది. దీన్ని తిప్పికొట్టేందుకు తగినంత బలం ఉన్నాINCని మరింత ఒంటరి చేసేలా NDA కొత్త వ్యూహంతో వెళ్తోంది. సభలో రాహుల్‌ను మాట్లాడనివ్వలేదన్న కారణంతో ఇచ్చిన ఈ తీర్మానంపై TMC సంతకం చేయలేదు. ఇది INC సొంత వ్యవహారంలా మారిందని ఇతర MPలూ విమర్శిస్తున్నారు. దీంతో వారి మద్దతు ఉపసంహరించేలా NDA తెరవెనుక ప్రయత్నిస్తోంది.

News February 20, 2026

జిల్లా రిజిస్ట్రార్‌గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

image

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్‌గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News February 20, 2026

ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: CM రేవంత్

image

హైదరాబాద్‌ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో టెక్నాలజీ దిగ్గజాలను TG CM రేవంత్ కోరారు. ‘ఏఐ శకం ఇప్పటికే మొదలైంది. మనిషి కంటే ఇది ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం’ అని సీఎం వివరించారు.