News October 21, 2025
వరంగల్: కాంగ్రెస్‌లో గులాబీ ముళ్లు

WGL ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తాయి. ఇప్పుడు మళ్లీ కొండా వివాదంలో అదే నడుస్తోంది. మేడారం టెండర్ల వివాదం నుంచి ఓఎస్డీ సరెండర్ వరకూ కొండా చుట్టూ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై నేతల మాటలకు మూతపడ్డాయి. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీసీ మహిళ మంత్రిని తొలగించేందుకు కడియం ప్రయత్నిస్తున్నాడని చెప్పడం దుమారం రేపింది.
Similar News
News October 21, 2025
బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి కీలకమైనది: కలెక్టర్

బాపట్ల జిల్లా పర్యాటక రంగానికి చాలా కీలకమైనదిగా ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం అన్నారు. ఆరు మండలాలలో సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతాలైన 17 పంచాయతీలలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 8 పంచాయతీ పరిధిలోని 9 బీచ్‌లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ఆదేశించారు. ఈ మేరకు సదరు పంచాయతీ సమావేశాలలో తీర్మానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
News October 21, 2025
ప్రజల్లో సంతృప్తికర స్థాయి పెరగాలి: సీఎం చంద్రబాబు

ఆర్టీజీఎస్‌లో ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వివిధ పౌర సేవలు, సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందే సేవలు, వారిలో సంతృప్తి స్థాయి సాధించే అంశంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ విజయానంద్, ఐటీ, ఆర్టీజీ, ఆర్ధిక, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.
News October 21, 2025
దీపిక-రణ్‌వీర్ కూతురిని చూశారా?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ కూతురు దువా ఫొటోను తొలిసారి షేర్ చేశారు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వారి కూతురు చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక, రణ్‌వీర్ జంటకు 2018లో వివాహం జరగగా గతేడాది సెప్టెంబర్‌లో పాప జన్మించింది.