News February 15, 2026

వరంగల్: కాంగ్రెస్ Vs BRS.. తేడా 2.89%

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా 2.89 శాతం మాత్రమే. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 3.35 లక్షల ఓట్లు ఉండగా, 2,62,377 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 1,10,680 ఓట్లు రాగా 42.19 శాతం , బీఆర్ఎస్ 1,03,117 ఓట్లతో 39.30 శాతం, బీజేపీ 17,590 ఓట్లతో 6.70 శాతం ఓట్లు వచ్చాయి. ప్రధాన పార్టీల మధ్య 2.89 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ విజయం సాధించింది.

Similar News

News February 16, 2026

ఇలా అయితే ఆక్వా మనుగడ కష్టమే!(1/3)

image

ట్రేడర్ల చేతిలో, సిండికేట్ల చేతిలో నిలువునా దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులకు రాయితీలు కూడా అందని ద్రాక్షగానే మిగిలాయి. కనీసం ఫ్యాన్లు, ఏరియేటర్లు వంటి వాటిని కూడా రైతులకు రాయితీపై అందించడం లేదు. రూ.1.50 యూనిట్ విద్యుత్ ఛార్జ్ అని కేవలం అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం పట్ల సాగు చేసే అందరి రైతులకు ఉపయోగపడటం లేదు. చెరువుల అనుమతుల విషయంలోనూ ప్రభుత్వాలు ఏమాత్రం రాయితీలు అందించిన పాపాన పోవడం లేదు.

News February 16, 2026

పెట్టుబడి ధరలు ఫుల్.. మద్దతు ధరలు నిల్..!(2/3)

image

ఆక్వా రైతులకు పెట్టుబడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫీడ్ తయారు చేసే సోయాబీన్ ధరలు తగ్గుముఖం పట్టినా రూ.60 వేలు ఉండే టన్ను ఫీడ్ ధర రూ. 90 వేలకు ఎగబాకింది. చెరువుల వద్ద ఏర్పాటు చేసే ట్రాన్సఫార్మర్ 40 కేవీ ధర 1.50 లక్షలు, 60 కేవీ ధర 2.50 లక్షలు గతంలో ఉండేది. ప్రస్తుతం అదే ట్రాన్సఫార్మర్ 60 కేవీ ధర రూ.5 లక్షలు అవుతుంది. ఇంతా భరించి పంట పండించినా సరైన ధర రాకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు.

News February 16, 2026

ప్రభుత్వ సాయం ఎక్కడ?(3/3)

image

ఈ పరిస్ధితుల్లో రైతులు ప్రతి దానికి సిండికేట్లను, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. కనీసం చెరువుల నీటి పరీక్షలకు కూడా ప్రైవేటునే రైతులు ఆశ్రయిస్తున్నారు. ఆకివీడులో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. ల్యాబ్‌లో ఒక్క పరికరమూ పనిచేస్తున్న పాపాన పోవడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆక్వా రైతులను ఆదుకోకుంటే భవిష్యత్తులో ఆక్వా రంగం మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.