News November 11, 2025
వరంగల్, కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్, కాజీపేట మీదుగా బెంగళూరు-ముజఫర్‌పూర్, యశ్వంతపూర్-ముజఫర్‌పూర్ మధ్య నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లకు వరంగల్ సహా పలు స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు.
Similar News
News November 11, 2025
వేదాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా?

వేదాలు అపౌరుషేయాలు. ఇవి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం నుంచి సహజంగా వెలువడినవి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించాలని సంకల్పించగా, ఆయనకు మొదట ‘ఓం’ అనే పవిత్ర ప్రణవనాదం వినిపించింది. బ్రహ్మ ఆ ఓంకార నాదాన్ని ధ్యానంలో గ్రహించి, ఆ పరమశబ్దాన్ని వేదజ్ఞానం రూపంలో మహర్షులు, రుషుల ద్వారా లోకానికి వెలువరించారు. అందుకే వేదాలను సనాతన ధర్మానికి మూలమైన దివ్యజ్ఞానంగా భావిస్తారు. <<-se>>#VedikVibes<<>>
News November 11, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

SBI 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎఫ్‌పీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News November 11, 2025
ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

విజయవాడ RTC జోనల్‌లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చి పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.


