News October 25, 2025

వరంగల్: కేంద్రాలు కరవాయే.. దళారులదే రాజ్యమాయే!

image

ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతు నష్టాల పాలవుతున్నారు. సకాలంలో పంట చేతికొచ్చినా అకాల వర్షాలతో కల్లాల్లో తడిసి ముద్దవుతున్నాయి. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు దళారులను ఆశ్రయిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రూ.1600 నుంచి రూ.1800లకే దళారులకు విక్రయిస్తూ ఉమ్మడి వరంగల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Similar News

News October 25, 2025

బస్సు యాక్సిడెంట్: హైదరాబాద్ కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

image

కర్నూలు(D) చిన్నటేకూరు వద్ద నిన్న తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సులో జరిగిన అగ్నిప్రమాద ఘటన విదితమే. ఇందులో మృతి చెందిన, చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు HYD కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సయ్య, సూపరింటెండెంట్‌–వాట్సాప్‌ నం: 9063423950
సంగీత, కంట్రోల్‌ రూమ్‌: నం: 9063423979కు ఫోన్ చేయాలన్నారు.

News October 25, 2025

అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

image

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.

News October 25, 2025

మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.