News February 13, 2025
వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News February 19, 2026
మదనపల్లెలో బాలిక హత్య.. నిందితుడి తల్లిపైనా కేసు

మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు నిందితుడి తల్లిపై కేసు నమోదు చేశారు. A1గా కులవర్ధన్‌ను, A2గా అతడి తల్లి అంజలిని పేర్కొన్నారు. అంజలిపై హత్య, హత్యా నేరం తారుమారు, హత్య జరిగిన సమాచారాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశామని DSP మహేంద్ర ప్రకటించారు. ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News February 19, 2026
HYD: రేపటి నుంచి జలమండలి బస్తీబాట

జలమండలి ప్రజలతో మమేకమయ్యే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జలమండలి.. బస్తీ బాట పేరుతో శుక్రవారం నుంచి వారానికి 4 రోజులు బస్తీలు, కాలనీల్లో అధికారులు ప్రత్యక్షంగా పర్యటించనున్నారు. ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టనున్నారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అధికారులు తెలిపారు.
News February 19, 2026
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు: DPRO

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమాచార అండ్ ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తెలిపినట్లు ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ DPRO విష్ణువర్ధన్ తెలిపారు. దరఖాస్తు జారీ ప్రక్రియ రోలింగ్ ప్రాతిపదికన కొనసాగుతుందన్నారు. దరఖాస్తు దారులు అధికారిక వైబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


