News September 23, 2025
వరంగల్: కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలు..!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలో అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు యువకులు భవాని మాత మాలలను ధరించారు. మండపాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రతిరోజు అలంకరణలు చేయడానికి గాను యువకులు భవానిమాలలు వేసుకున్నారు. మంగళవారం గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Similar News
News September 22, 2025
వరంగల్ భూ సేకరణపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

వరంగల్ జిల్లా భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దసరా పండుగకు ముందే జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసులు, టైటిల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. వరంగల్ అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి 176.52 హెక్టార్లలో 147.30 హెక్టార్లు సేకరణ పూర్తైందని, మిగతా పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
News September 22, 2025
వరంగల్: నిన్న అలా.. నేడు ఇలా..!

బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఉన్న క్రేజ్ మిగతా రోజులకు ఉండట్లేదు. తొమ్మిది రోజులు జరుపుకునే ఘనమైన పండుగ బతుకమ్మ. కానీ, నేటి మహిళలు కేవలం మొదటి, చివరి రోజులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజు దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలతో కిటకిటలాడగా, రెండవ రోజు అసలు బతుకమ్మ ఊసే లేకుండా పోయింది. వరంగల్ జిల్లా మొత్తం పరిస్థితి నెలకొంది.
News September 22, 2025
నేటి నుండే వరంగల్ భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు..!

వరంగల్ శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక్కో రోజు ఓ అలంకరణలో ఇలా..
1వ రోజు బాల త్రిపుర సుందరి
2 వ రోజు అన్నపూర్ణ దేవి
3 వ రోజు గాయత్రి దేవి
4 వ రోజు శ్రీ మహాలక్ష్మి కూష్మాండీ
5 వ రోజు శ్రీ రాజ రాజేశ్వరి
6 వ రోజు భువనేశ్వరి
7 వ రోజు భవాని కాత్యాయని
8 వ రోజు శ్రీ సరస్వతి మాత
9 వ రోజు మహా దుర్గలంకరణ
10 వ రోజు మహిషాసుర మర్దిని గా దర్శనం ఇవ్వనుంది.